జనసేన నేతపై కత్తితో దాడి

69చూసినవారు
జనసేన నేతపై కత్తితో దాడి
AP: విజయనగరం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రామభద్రపురంలో జనసేన నాయకుడిపై దాడి జరిగింది. జనసేన మండల నాయకుడు మహంతి ధనుంజయపై అక్కు నాయుడు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు చేసినందుకు ధనుంజయపై దాడికి పాల్పడినట్లు సమాచారం. స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా  స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్