ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రతలు అంచనాల కంటే ఎక్కువగా నమోదయ్యాయని ఐరోపా వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇప్పటిదాకా రికార్డుల్లో నమోదైన అత్యంత వేడి జనవరి నెలదేనని పేర్కొంది. లానినా ప్రభావంతో ఈసారి ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్న అంచనాలు తలకిందులయ్యాయని తెలిపింది. గత నెలలో ప్రపంచవ్యాప్త సగటు ఉష్ణోగ్రత 13.23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. జనవరిలో నమోదైన సగటు ఉష్ణోగ్రత కంటే 0.09 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా పేర్కొంది.