AP: తన భూమిని కబ్జా చేశారని మడకశిరకు చెందిన ఓ జవాన్ జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. హుదుగూరు గ్రామంలో కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలని బీఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి అధికారులను వేడుకున్నారు. తన భూమిలో సాగు చేయడానికి వెళ్తే నాగరాజు అనే వైసీపీ నేత రాళ్లు, కొడవలి తీసుకుని దాడి చేస్తున్నాడన్నారు. పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.