ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆదివారం జరగనుంది. ఉదయం 9 గంటల 12 గంటల వరకు పేపర్–1 9 పరీక్ష జరగనుండగా.. మధ్యాహ్నం 2:20 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ –2 పరీక్ష జరగనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి డిజిటల్, అనలాగ్ వాచ్‌లు, ఉంగరాలు, చెవిపోగులు, ముక్కుపుల్లలు, చైన్లు, నెక్లెస్‌లు, పెండెంట్‌లు, బ్యాడ్జీలు, హెయిర్ పిన్నులను ధరించకూడదు. విద్యార్థులు అడ్మిట్‌కార్డుతోపాటు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ను వెంట తీసుకెళ్లాలి.