మోసాలు చేయడం సీఎం చంద్రబాబుకు అలవాటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. హామీలు అమలు చేయలేక జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంపై ఇచ్చిన జీవోను సవరించాలని, ప్రతి తల్లికి అనే పదం తీసేసి ప్రతి విద్యార్థికి అని చేర్చాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరకి రూ.15,000 చొప్పున ఇవ్వాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.