ఆంధ్రప్రదేశ్ అమరావతి సెక్రటేరియట్‌లోని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ 66 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్‌టీజీఎస్, ఎవేర్ హబ్, ఆర్‌టీజీఎస్ అడ్మినిస్ట్రేషన్, డేటా ఇంట్రిగేషన్ అండ్ అనలిటిక్స్ హబ్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 25వ తేదీలోగా jobsrtgs@ap.gov.in మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు అధికారిక https://rtgs.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.