ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నారా లోకేశ్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించిన పాల్.. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలను ఏకి పారేశారు. ఈ క్రమంలో లోకేశ్ గురించి మాట్లాడుతూ..‘ చీటికి మాటికి రెడ్‌బుక్ తీస్తానని నారా లోకేశ్ బెదిరిస్తున్నాడు. నా బుక్ తీశానంటే నువ్వు ఉండవు’ అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.