తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విబేధాలు తలెత్తాయి. టీడీపీ శ్రేణుల సమావేశంలో మంత్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్ర రెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు. హార్స్లీ హిల్స్‌లో ఆదివారం నాడు జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఎదుటే నేతలు సవాళ్లు విసురుకొని ధూషించుకున్నారు. దీంతో మంత్రి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.