బద్వేల్: దళితుల ఇండ్లను కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలి

66చూసినవారు
బద్వేల్: దళితుల ఇండ్లను కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలి
బద్వేల్ లో దళితుల ఇండ్లను కూల్చిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి మునెయ్య శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఐలమ్మ కాలనీలో దొడ్డగాల గంగయ్య 16 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఈనెల 22న వారు ఇంటి వద్ద లేని సమయం చూసి జెసిబితో గుర్తు తెలియని వ్యక్తులు ఇండ్లను కూల్చివేశారన్నారు. వారికి న్యాయం చేయాలన్నారు.