బద్వేల్ లోని ప్రభుత్వ పాఠశాలాల్లో శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళన సమావేశాలను ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి బద్వేల్ టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాలలో విద్యా బోధన సదుపాయాల గురించి ఉపాధ్యాయును, తల్లిదండ్రులతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివితే తమ భవిష్యత్తు బాగుంటుందని వారికి సూచించారు.