కమలాకూరు గ్రామంలో ఆదివారం ఉపాధి శ్రామికుల సమస్యలను తెలుసుకునేందుకు వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేశ్, మండల అధ్యక్షురాలు దుర్గమ్మ, కార్యదర్శి రమణయ్యలు మాట్లాడుతూ.. కమలాకూరులోని శ్రామికులకు కేవలం నాలుగు వారాలే పని కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రామికులకు వంద రోజులు ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.