ఆదివారం గుంటూరులో మాలల మహా గర్జనకు బి. కోడూరు మండలం పోరుమామిళ్ల నుంచి మాల నాయకులు దాదాపు 50 మంది పైగా మాలల గర్జనకు తరలివెళ్లారని అంబేడ్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిమంది గుంటూరు సభకు తరలి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.