బద్వేల్ నియోజకవర్గం బి. కోడూరు మండలం ఆనంవారిపల్లె గ్రామంలో మినీ గోకుల షెడ్డును టీడీపీ ఇన్ ఛార్జ్ రితీశ్ కుమార్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రామ మోహన్ రెడ్డి, రమణారెడ్డి, రవీంద్ర రెడ్డి, రామ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.