అట్లూరు మండలంలో ఉ 8 గంటలకే మద్యం అమ్మకాలు

82చూసినవారు
అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న వైన్ షాప్ బుధవారం ఉదయం 8 గంటలకే విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. మండలంలోని గ్రామాలలోని బెల్ట్ షాప్ మద్యం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 9: 30 వరకు తెరవాల్సిన షాపును అట్లూరు మండలంలో ఉదయం 8గంటలకే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఎక్స్చేంజి అధికారులు చర్య తీసుకోవాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్