బద్వేలు: నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలి

71చూసినవారు
బద్వేలు: నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలి
కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని మాట చెప్పి ఇప్పుడు వారి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్షుడు ప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం సీపీఐ కార్యాలయ జీవీ భవనంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి, ఇప్పుడు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్