బద్వేలు విద్యానగర్‌లో వైకాపా జడ్పీటీసీ సభ్యుడు వంకెల చిన్న పోలిరెడ్డి ఇంటిని శుక్రవారం పురపాలక అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా రెండు అంతస్థుల భవనం నిర్మించారని, షట్టర్‌పై హెచ్చరిక బోర్డు పెట్టారు. అయితే ఇది డీకేటీ పట్టా స్థలం అని, అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చిన్న పోలిరెడ్డి, ఆయన సోదరి లక్ష్మీదేవి తెలిపారు.