మసీదు ఇమామ్, మౌజన్లకు అందచేస్తున్న వేతనాలను కొనసాగిస్తూ ప్రభుత్వం జీఓ జారీచేయడం హర్షణీయమని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జహంగీర్ బాషా హర్షం వ్యక్తం చేశారు. శనివారం బద్వేల్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలను కొనసాగిస్తూ జీఓ జారీచేయడం హర్షణీయమన్నారు.