కాశినాయన జ్యోతి క్షేత్రంపై రాజకీయాలు చేయొద్దని ఖాదీ & గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి పేర్కొన్నారు. బుధవారం జ్యోతి క్షేత్రాన్ని సందర్శించి ఇటీవల జరిగిన కూల్చివేతలను పరిశీలించారు. గత ప్రభుత్వ నాయకులు జ్యోతి క్షేత్ర సమస్య గురించి ఏనాడు కూడా మాట్లాడని వారు ప్రస్తుతం ఇదే అదునుగా చూసుకొని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం జ్యోతి క్షేత్ర సమస్యను పరిష్కరించాలన్నారు.