బద్వేల్: ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలి

76చూసినవారు
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సై కల్లూరు జయరామిరెడ్డి పలు ప్రధాన రహదారుల్లో వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేనివారికి రూ. 500, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి రూ. 1000 చలానా విధించారు. అలాగే ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్