బద్వేల్ లో నాలుగు రోడ్ల కూడలిలో బుధవారం అర్బన్ ఎస్ఐలు సత్యనారాయణ, రవికుమార్ లు పలు ప్రధాన రహదారులలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనాల రికార్డు లేని వాహనదారులకు జరిమానా విధించారు. వాహనదారులు ప్రతి ఒక్కరు వాహనాలకు సంబంధించిన రికార్డును ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.