కాశినాయన మండలంలోని సావిశెట్టిపల్లి గ్రామంలో విష జ్వరాలతో అల్లాడుతున్న గ్రామస్తులు అనే శీర్షికతో లోకల్ యాప్ లో ప్రచురితమైంది. ఈ విషయంపై సంబంధిత వైద్య అధికారులు స్పందించి సావిశెట్టిపల్లిలో ఆదివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ పుష్ప, సిహెచ్ఓ నిర్మల, పి హెచ్ ఎం శారదా, సూపర్వైజర్ బాలయ్య, చంద్ర శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.