బద్వేల్- సిద్దవటం ప్రధాన రహదారిలో నివసిస్తున్న ఫణీంద్రరెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు. రాజకీయ కక్షతో ఈ నోటీసులు పెట్టారని శనివారం బాధితుడి తండ్రి పోలి రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రస్తుతం తాను జడ్పీటీసీగా ఉన్నానని, టీడీపీలోకి ఆహ్వానిస్తే ససేమిరా అన్నందుకు టార్గెట్ చేసి ఈ చర్యలకు
పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.