బద్వేల్ పరిధిలో ఏదైనా నిర్మాణాలకు అప్రూవల్ తప్పనిసరి అని లేకుంటే నిర్మాణాలు తక్షణమే తొలగిస్తామని కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సందు, రస్తాలను ఆక్రమించి, డ్రైనేజీ కాలువల పైన స్టెప్స్, మరుగుదొడ్లు వంటివి, రోడ్డు మీదకు కట్టిన స్టెప్స్ స్వచ్చందంగా తొలగించుకోవాలని యజమానులను కోరారు. రోడ్డు మీదికి వచ్చేలా షాప్ల పేర్లతో కూడిన బోర్డులు, వ్యాపార ప్రకటన బోర్డులు పెట్టరాదని అన్నారు.