పొలాలలోకి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేయాలంటూ సోమవారం నేషనల్ హైవే బద్వేల్ గుంతపల్లె బైపాస్ రోడ్డు వద్ద రైతుల నిరసన చేపట్టారు. బద్వేల్ గుంతపల్లె సమీపంలో ఎన్ హెచ్ 67హైవే బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రక్కన 100 మీటర్ల లో పొలాలకు సర్వీస్ రోడ్డు లేకపోవడంతో 5 కిలోమీటర్లు మేర తిరిగి వెళ్లాలన్నారు. అధికారులు స్పందించి మా పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు.