బద్వేల్ పట్టణంలో వీధిదీపాలు ఎక్కడ వెలగడం లేదో సిబ్బంది పర్యవేక్షిస్తూ రిపేర్ వస్తే ఎప్పటికప్పుడు సమస్య పరిష్కరిస్తూ వుండాలని మున్సిపల్ కమీషనర్ నరసింహ రెడ్డి అన్నారు. తమ వీధులలో ఎక్కడైనా లైట్ వెలగపోతే ప్రతి సచివాలయంలో కంప్లైంట్ రిజిస్టర్ ఏర్పాటు చేయడము జరిగిందన్నారు. వీధిలైట్లు నిర్వహణలో సిబ్బందికి ఏదైనా సమస్య ఎదురైతే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి సూచించారు.