బద్వేల్: ఈత కోసం వెళ్లి విద్యార్థిని మృతి

69చూసినవారు
బద్వేల్: ఈత కోసం వెళ్లి విద్యార్థిని మృతి
అట్లూరు మండలంలోని కమలకూరు గ్రామానికి చెందిన చిట్టిబోయిన తేజ (15)ఈతకు వెళ్లి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తోటి విద్యార్థులతో కలిసి గ్రామ సమీపంలో సగిలేరు ఆనకట్టకు వద్ద ఈతకు వెళ్ళింది. ఈత ఆడుతుండగా నడుము కట్టుకున్న ప్లాస్టిక్ వస్తువు జారిపోవడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. విద్యార్థిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్