బద్వేల్: ఒప్పంద కార్మికులకు వేతనాలు పెంచాలి - ఏఐటీయూసీ

30చూసినవారు
బద్వేల్: ఒప్పంద కార్మికులకు వేతనాలు పెంచాలి - ఏఐటీయూసీ
రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బద్వేల్ సమితి ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. మున్సిపాలిటీలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్