బద్వేల్ లో రోడ్డు ప్రమాదం

66చూసినవారు
బద్వేల్ లో రోడ్డు ప్రమాదం
బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్లే రోడ్డుపై సోమవారం పోరుమామిళ్ల బైపాస్ వద్ద భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బద్వేల్ లక్ష్మీపాలెంకు చెందిన గోపాల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్