బద్వేలు పట్టణంలోని విజయ బేకరీలో మున్సిపల్ కమిషనర్ వివి. నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు శుక్రవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనీ కేకులు చెడిపోయినట్లు గుర్తించిన శానిటేషన్ అధికారులు 5 వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ బేకరీలలో నాణ్యత, పరిశుభ్రత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.