పోరుమామిళ్ల: 200 మంది వృద్ధులకు దుస్తులు పంపిణీ

81చూసినవారు
పోరుమామిళ్ల:  200 మంది వృద్ధులకు దుస్తులు పంపిణీ
కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో 200 మంది వృద్ధులకు డాక్టర్ గీతా తోమస్ రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. శుక్రవారం రంగసముద్రం గ్రామ సర్పంచ్ చిత్తా రవి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో వారికి దుస్తులు, దుప్పట్లు అందజేశారు. క్రిస్మస్ సందర్భంగా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. వారికి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోలీ రోజరీ చర్చి గురువులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్