పొరుమామిళ్ల క్రీడాకారులు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగు జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించారు. ఈనెల 10, 11, 12వ తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పోరుమామిళ్ల క్రీడాకారులు ప్రతిభచూపి 5 బంగారు పతకాలు, 7రజత, 5 కాంస్య పతకాలు సాధించారని మాస్టర్ నాయబ్ రసూల్ గురువారం తెలిపారు. బంగారు పతకాలను నదీశ్, తారక్, ఆఫ్రిన్, మాధవి లత, తస్లీమా బంగారు పతకాలు సాధించారు.