కాశినాయన మండలంలోని ఓబులాపురానికి చెందిన నీలం అనురాధ (25) అనే యువతి శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమెకు ఒక చిన్న పాప ఉన్నట్లు సమాచారం. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.