ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహా రెడ్డి వ్యాపారులకు సూచించారు. బుధవారం బద్వేలు పట్టణంలోని పలు షాపులను కమిషనర్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ బదులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకోవడంతోపాటు క్యారీ బ్యాగులు ప్రజలు తెచ్చుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.