దేవాలయాలు మసీదులు మరియు చర్చిల యొక్క నిర్వాహకులను స్టేషన్ కు పిలిచి విగ్రహాలు, హుండీల భద్రత కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోరుమామిళ్ల సిఐ శ్రీనివాసులు అన్నారు. బుధవారం సాయంత్రం పోరుమామిళ్ల పోలిస్టేషన్లో వారు మాట్లాడుతూ ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వారి ప్రవర్తనలో అనుమానం ఉంటే పోలీసు వారికి తెలపాలని, దొంగతనాలు పట్ల జాగ్రత్త వహించాలని తగు సూచనలు సలహాలు ఇచ్చారు.