బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో ఉన్నటువంటి స్మశాన స్థలాన్ని కొంతమంది ఆక్రమణ దారులు ఆక్రమించు కోవడంతో స్మశానం కుదించకు పోయినది. దీనితో కందిమల్లాయపల్లెలోని గ్రామ ప్రజలు రెవెన్యూ అధికారులు స్మశాన స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి ఆక్రమించినటువంటి స్మశాన స్థలాన్ని మళ్లీ పునరుద్ధరించాలని, ఆక్రమణదారుల పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్మశాన స్థలాన్ని కాపాడాలని మంగళవారం ప్రధాన రహదారి పైన ఆందోళన చేశారు.