వైసీపీ యువనేత డాక్టర్ వైయస్ అభిషేక్ రెడ్డికి బద్వేలు నియోజకవర్గ నేతలు నివాళులు అర్పించారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి నిన్న హైదరాబాదులో మరణించారు. శనివారం పులివెందులలో అంత్యక్రియల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి తరలి వెళ్లిన ముఖ్య నేతలు పూలమాలతో నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.