మడకలవారిపల్లె సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ శేఖర్ ను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి శనివారం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లె గ్రామంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేసినట్లు చెప్పారు.