సబ్సిడీ విత్తనాలను వెంటనే రైతులకు అందించి ఆదుకోవాలి: చిన్ని

74చూసినవారు
సబ్సిడీ విత్తనాలను వెంటనే రైతులకు అందించి ఆదుకోవాలి: చిన్ని
పట్టణంలో కల్తీ ఎరువులను, విత్తనాలను అందిస్తున్నటువంటి ఎరువుల అంగళ్లపై దాడి చేసి వాటిని అరికట్టాలని, సకాలంలో సబ్సిడీని అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డివైఎఫ్ఎ కడప జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని డిమాండ్ చేశారు. సోమవారం వ్యవసాయ శాఖ ఏడిఏ ఎం నాగరాజు కి బద్వేల్ పట్టణ కమిటీ, రూరల్ కమిటీ ల ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మస్తాన్, షరీఫ్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్