బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ లోని కూల్ డ్రింక్ షాప్ లో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగిందని బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడి వివరాల మేరకు షాపు పైభాగాన రేకులు తొలగించి దుండగులు చోరీ చేశారు. షాప్ లో క్యాష్ కౌంటర్ లోని 15వేల రూపాయల నగదు, 20 వేల రూపాయల సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారని అన్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.