పోరుమామిళ్లలో అంబేడ్కర్ కు నివాళి

60చూసినవారు
పోరుమామిళ్ల పట్టణంలో అంబేడ్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు ఆధ్వర్యంలో శుక్రవారం అంబేడ్కర్ 68వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్