ఎర్రగుంట్లలో చెట్టును ఢీ కొట్టిన ఆటో

78చూసినవారు
ఎర్రగుంట్లలో చెట్టును ఢీ కొట్టిన ఆటో
ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామ సమీపంలో గురువారం నలుగురు ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిలో ఒకరిని కర్నూలుకు, మరొకరిని తిరుపతి
ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

సంబంధిత పోస్ట్