ఎర్రగుంట్ల అల్ట్రాటెక్ ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం తమ డిమాండ్స్ పరిష్కారం కోసం కొందరు నిరనస చేస్తుండగా.. మరికొందరు విధులకు హాజరయ్యేందుకు వచ్చారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డిమాండ్స్ పరిష్కరించే వరకు ఎవరూ విధులకు హాజరయ్యేందుకు వీలులేదని ఒక వర్గం వారు అడ్డగించారు.