జమ్మలమడుగులో నారాపురం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి ఆధ్వర్యంలో 18వ తేదీ జాతీయస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు గురువారం నిర్వాహకులు తెలిపారు. ఆరోజు ఉదయం 7: 30 గంటలకు న్యూ కేటగిరి విభాగంలో, 19వ తేదీ ఉదయం సీనియర్ విభాగంలో పోటీలు ఉంటాయని వెల్లడించారు.