జమ్మలమడుగులో మంగళవారం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని గూడెం చెరువు గ్రామం వద్ద వాహనాలు తనిఖీలు చేసి రికార్డు లేని 43 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సిఐ లింగప్ప గ్రామీణ పరిధిలో తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రామకృష్ణ హైమావతి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.