ఎర్రగుంట్లలో ఐదో రోజుకు చేరుకున్న ధర్నా

56చూసినవారు
ఎర్రగుంట్లలోని ఐసీఎల్ (అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు చేపట్టిన నిరసన సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. తాము 20 ఏళ్లుగా పనిచేస్తున్నామని పనికి తగ్గ వేతనం చెల్లించడం లేదని కార్మికులు వాపోయారు. వేతనాలు పెంచాలని యాజమాన్యాన్ని కోరితే పరిశ్రమ నుంచి వెళ్లిపొమ్మన్నారని వాపోయారు. యాజమాన్యంతో చర్చలు జరిపి తమ డిమాండ్లను పరిష్కరించాలని లేనిచో, నిరసన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్