సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని రైల్వే ఎస్ఐ రవిచంద్ర పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఇరువురు వ్యక్తులు వేర్వేరుగా కలమల్ల, ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలో కుటుంబ కలహాల నేపథ్యంలో విసిగిపోయి మంగళ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన ఆర్ఎస్ఐ రవిచంద్ర తన సిబ్బందితో అక్కడికి వెళ్లి అడ్డుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం శ్రీనివాస్ ను భార్య, పిల్లలకు అప్పగించారు.