జమ్మలమడుగు పరిధిలోని యర్రగుంట్ల మండలం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జమ్మలమడుగు జనసేన పార్టీ కోఆర్డినేటర్దేరంగుల జగదీష్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితంతో సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని, అన్ని రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఉపయోగించాలని, ప్రతి ఒక్కరు దీనికోసం ముందడుగు వేయాలన్నారు.