మైలవరం మండలం వేపరాలకి చెందిన వేణు (32) అనే యువకుడు ఈనెల 6వ తేదీ నుంచి కనిపించడంలేదని తండ్రి చౌడప్ప మైలవరం పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులోని ఓ షాపులో గుమాస్తాగా పనిచేసేవాడని, షాపుకు అని వెళ్లి తిరిగి రాలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ శ్యామ్ సుందర్ రెడ్డి ఆచూకీ తెలిసినవారు 9121100608 నంబరుకు సమాచారం అందించాలని కోరారు.