యర్రగుంట్ల మార్కెట్ యార్డులో ఈనెల 1వ తేదీన జరిగిన షెక్షావలి హత్యకేసును పోలీసులు ఛేదించారని శనివారం డీఎస్పీ వెంకటేశ్వర రావు తెలిపారు. షెక్షావలి చెల్లెలితో జాఫర్ హుస్సేన్ సహజీవనం చేస్తున్నాడు. ఇది వద్దని జాఫర్ మందలించడంతో కక్షపెంచుకుని, పథకం ప్రకారం యార్డుకు రప్పించుకుని షెక్షావలిని బండరాయితో కొట్టి చంపాడు. కేసునమోదు చేసి ముద్దాయిని ప్రొద్దుటూరులో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.