జమ్మలమడుగు: చిరుధాన్యాల సాగుపై అవగాహన

71చూసినవారు
జమ్మలమడుగు: చిరుధాన్యాల సాగుపై అవగాహన
జమ్మలమడుగు మండలం దేవగుడి, సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు గ్రామాలలో వికసిత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వనిపెంట కేవీకే ప్రధాన శాస్త్రవేత్త బాలకృష్ణ మాట్లాడారు. రైతులు మినుము, పెసర, వరి, వేరుశనగ వంటి పంటలు సాగు చేసే సమయంలో మేలు రకమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు. చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్